Food Adulteration: కల్తీగాళ్ల కళలు.. 42 రకాలు..!
పన్నీర్.. వెజిటేరియన్లు ప్రాణప్రదంగా భావించి ఇష్టంగా తినే మోస్ట్ వాంటెడ్ పదార్థం. శాకాహార వంటల్లో పన్నీర్‌కే అగ్రతాంబూలం. అత్యంత పరిశుభ్రమైన పద్ధతుల్లో తయారయ్యే క్లీన్ అండ్ ప్యూర్ పన్నీర్ కొనాలంటే కిలో రెండువేలు పెడితే గాని దొరకదు. కానీ... కొన్నిచోట్ల కేవలం ఐదారువందల రూపాయలకే కిలో పన్నీర్ దొరికేస్తోంది. ఇదెలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? అంతా కల్తీ మాయ. కల్తీగాళ్ల కళాపోషణ రోజురోజుకీ మితిమీరిపోతోంది. ఒకటి కాదు రెండుకాదు.. వారం రోజుల్లో మొత్తం 42 రకాల కల్తీ పదార్ధాల్ని సీజ్ చేశారు రాచకొండ SOT పోలీసులు. మాకు దొరికినవైతే ఇవి.. దొరకని కల్తీ పదార్థాలు ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మా చట్టాలు ఏమీ చేయలేవు... అని చేతులెత్తేస్తున్నారు పోలీసులు.

ఔట్‌సైడ్ ఫుడ్ తింటున్నారా.. అయితే మీరు త్వరగా ఔటైపోతారు.. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కల్తీనే. మీరు తినేదీ తాగేదీ ఏదీ ఒరిజినల్ అనే గ్యారంటీ లేదు. కాసుల కక్కుర్తితో ప్రజారోగ్యంతో చెలగాటమాడే కల్తీగాళ్లు భాగ్యనగరం చుట్టూ మాటు వేసి ఉన్నారు. కాటేస్తూనే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్, ఆర్మ్‌డ్ రిజర్వు.. ఇలా అందరూ కలిసి వారం రోజులుగా చేపట్టిన తనిఖీల్లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, మల్కాజ్‌గిరి, భువనగిరి ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసి…. 575 లీటర్ల కల్తీ నెయ్యి, 3,946 కిలోల అల్లం పేస్ట్, 3,037 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బ్రాండ్లు ఉపయోగించి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ముఠాల్ని గుర్తించారు. చేతినిండా లాభాలు వస్తూ ఉండటంతో… అది కల్తీ మాల్ అని తెలిసినా యదేచ్ఛగా అమ్మేస్తున్నారు దుకాణదారులు. సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో తయారయ్యే అల్లం- వెల్లుల్లి పేస్ట్ కేసులు చాలానే చూశాం. వంట మసాలాలు, పాలు, కారం, టీ పొడి, స్వీట్లు, పసుపు, స్వీట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ వస్తువులు, మినరల్ వాటర్.. ఇలా ప్రతీదీ కల్తీ జరిగాకే మన దగ్గరకు వస్తోంది. రోగనిరోధకశక్తిని పెంపొందించుకోడానికి వాడే పదార్థాల్లో సైతం రోగ కారకాల్ని వాడేస్తున్నారు. డేంజరస్ కెమికల్స్ ఉపయోగించి ఇమ్యూన్ బూస్టర్ పౌడర్లు తయారుచేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో...