Telangana: మాయ మాటలే పెట్టుబడి.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. చివరికి ఇలా దొరికారు!
జాబ్ రాట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కొరియర్ ఫ్రాడ్ పేర్లతో బాధితుల వద్ద నుంచి కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన నేరస్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ నేరస్థులపై ఉక్కు పాదం మోపుతున్నారు పోలీసులు. వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుండి కోట్ల కొల్లగొడుతున్న సైబర్ నేరస్తులను జల్లాడ పడుతున్నారు. గతంలో జాబ్ రాట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కొరియర్ ఫ్రాడ్ పేర్లతో బాధితుల వద్ద నుంచి కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన నేరస్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు వీటి మీద ఎంత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు బాధితులు. తమకు కొరియర్ వచ్చిందని అడిగినంత డబ్బు చెల్లించకపోతే జైలు పాలవుతారంటూ బెదరింపులకు దిగుతున్నారు. దీంతో కొన్ని లక్షల రూపాయల నొక్కేశారు. ఉద్యోగం చేసుకుంటున్న వారితోపాటు చదువుకున్న వారు రిటైర్డ్ ఉద్యోగులు కూడా డబ్బులను సైబర్ ఖాతాలలో వేసి మోసపోయారు. తాజాగా అరెస్టు చేసిన 18 మంది నేరగాళ్ళలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 319 కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు, ఒక్క తెలంగాణలోనే నిందితులపై 45 కేసులు ఉన్నాయి.
సైబర్ నెరగాళ్లపై రాష్ట్ర పోలీసులు దండయాత్ర కొనసాగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆరు ప్రత్యేక బృందాలతో వారం రోజులు పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 364 కేసుల్లో వాంటెడ్ గా ఉన్న 18 మందిని అరెస్టు చేశారు. నిందితుల బ్యాంక్ అకౌంట్ లో రూ. 1.61 కోట్లను ఫ్రిజ్ చేశారు. వారిలో ముగ్గురు సైబర్ కింగ్‌ఫిన్స్ కాగా, మరో 15 మంది బ్యాంకు ఖాతాలను సప్లై చేసిన వారు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఐదు లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, 7 బ్యాంక్ పాస్‌బుక్‌లు,11 చెక్‌బుక్‌లు, 10 సిమ్ కార్డులు, రెండు లాప్‌టాప్‌లు, రెండు డిస్క్ టాప్ కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఆర్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు డిజిటల్ అరెస్టుతో బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇన్సూరెన్స్ ఓటిపీ ఫ్రాడ్ కేసుల్లో నిందితుల మొత్తం 6.94 కోట్లు కొట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 45 కేసులు సహ దేశవ్యాప్తంగా మరో 319 కేసుల్లో నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో లింక్స్ దొరికాయి. వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. బాధితులు అందించిన ఫోన్ నెంబర్లు బ్యాంకు ఖాతా ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ దర్యాప్తు చేశారు. ముంబైలో ఆరుగురు, బెంగళూరులో ఐదుగురు, అజ్మీర్ కు చెందిన ముగ్గురు, భరత్‌పూర్‌కు చెందిన ఇద్దరు సహా నాగపూర్ లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరపరిచి, ట్రాన్సిట్ వారింట్‌తో హైదరాబాద్‌కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..