Huzurabad By Election – Congress: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు షురూ.. ఆ కామెంట్స్ ఎటు దారి తీస్తాయో..!

|

Nov 02, 2021 | 9:59 PM

Huzurabad By Election - Congress: ‘‘ఊరంతా ఒక దారి - ఉలిపిరికట్టెది మరొక దారి’’ అన్న నానుడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోలుతుంది. ఎందుకంటే.. మిగిలిన పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే..

Huzurabad By Election - Congress: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు షురూ.. ఆ కామెంట్స్ ఎటు దారి తీస్తాయో..!
Representative Image
Follow us on

Huzurabad By Election – Congress: ‘‘ఊరంతా ఒక దారి – ఉలిపిరికట్టెది మరొక దారి’’ అన్న నానుడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోలుతుంది. ఎందుకంటే.. మిగిలిన పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే.. టీ కాంగ్రెస్ ది మరో ఎత్తు. నువ్వా నేనా.. సై అంటే సై.. దెబ్బకు దెబ్బ.. అంటూ ప్రత్యర్ధులతో కలబడాల్సిన పార్టీ నాయకత్వం.. తమలో తాము కుమ్ముకోవడంలో బీభత్సమైన ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఉన్న గొడవలు చాలవన్నట్టు ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తోడు కావడంతో.. పార్టీలో అంతర్గత పోరు నెక్ట్స్ లెవల్‌కి చేరింది.

హుజూరాబాద్‌లో భారీ స్థాయిలో కేడర్ ఉన్నా.. లీడర్‌షిప్ కరువవడం, ఉన్న ఓట్లు కూడా వేయించుకోలేక పోవడం ఆ పార్టీకి చెల్లింది. ఇంత కీలక ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఉందా? లేదా? అన్నట్లుగా వ్యవహరించింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు. ‘‘కేడరున్నా లీడర్ షిప్ కరవై.. ఉన్న ఓట్లు కూడా వేయించుకోలేక పోయాం.. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కనీసం ఒక్క బహిరంగ సభ కూడా పెట్టలేదు. ఇంతోటి దానికి రేవంత్ రెడ్డి ఎందుకు? ఆయన చరిష్మా ఎందుకు? ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి నివేదిస్తా’’ అని ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఇక బల్మూరి వెంకట్ ను బలి పశువును చేశామన్నది జగ్గారెడ్డి అదనపు హై ఓల్టేజ్ కామెంట్. పొన్నం ప్రభాకర్ అయితే.. ‘‘ఈ ఫ్లాప్ షో.. తామెపుడో ఊహించాం’’ అని తెలంగాణ ఆక్టోపస్ లా రియాక్టయ్యారు.

కాగా, సీనియర్ల కామెంట్లపై.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను అడిగితే.. ఆయనది.. మరో రకమైన ఎక్స్‌ప్రెషన్. వదిలేయండి బాబూ అంటూ నీళ్లు నమలడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన వ్యాఖ్యానం. ఒక్కో రకమైన స్పంద. ఇక మరో కీలక నేత మధు యాష్కి ఏదో చెప్పబోయే ప్రయత్నం చేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్.. హుజురాబాద్ ఎన్నికలనే తాము బహిష్కరించామనీ.. ఇదసలు ఎన్నికే కాదనీ.. ఇరు వర్గాల మధ్య ఆస్తి తగాదా? అంటూ ఖేల్ ఖతం అనిపించారు.

నాయకుల తీరు ఇలా ఉంటే.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చేయాలో అర్ధం కాని గజిబిజి పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మొదలు పెడితే.. సీనియర్ లీడర్ల వరకూ అందరిలోనూ తెలియని అసంతృప్తి పెల్లుబుకుతోంది. హుజురాబాద్ ఫలితం ఎలా జీర్ణించుకోవాలో అర్ధం కాక స్టేట్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పీఏసీ మీటింగ్ పెట్టి.. పోస్ట్ మార్టం చేస్తాం అని చెబుతున్నారు. మరి ఈ అంతర్గత విబేధాలన్నిటినీ మరిచి.. కేడర్ ని ఏకతాటిపైకి తెచ్చి.. టీ కాంగ్రెస్ తిరిగి ఫామ్ లోకి వచ్చేనా? లేక ఎప్పటికీ ఇంతేనా? కాలమే సమాధానం చెప్పాలి.

Also read

Railway Passengers: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! ఇప్పుడు ATVM స్మార్ట్ కార్డ్ చెల్లుతున్నాయ్..

Health News: ఈ ఫుడ్ తింటున్నారా జాగ్రత్త..! పెద్దపేగు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం..

Viral Video: అచ్చం చిన్న పిల్లోడిలానే జలకాలాడిన గజరాజు.. క్యూట్ వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..