Huzurabad By Election – Etela Rajender: తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మూడు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ మాటల తూటాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహించారని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హుజూరాబాద్ పోలీసులు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆటో, కారు ఢీకొనడంతో సోమవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. దీంతో రోడ్డుపై మృతుడి బంధువులు రాస్తారోకోకు దిగారు. ఈ క్రమంలో హజూరాబాద్- పరకాల రహదారిపై మూడు గంటలుగా ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా వెళ్తున్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించారు.
Also Read: