Huzurabad By Election: ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎగురేది కాషాయం జెండా.. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాంః ఈటల రాజేందర్

హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నిక.. ధర్మం, న్యాయం కాపాడటంలో, ఆహాంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.

Huzurabad By Election: ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎగురేది కాషాయం జెండా.. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాంః ఈటల రాజేందర్
Etela Rajendar

Updated on: Jul 17, 2021 | 3:25 PM

BJP Leader Etela Rajendar: హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నిక.. ధర్మం, న్యాయం కాపాడటంలో, ఆహాంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన హుజూరాబాద్‌లో ఎగిరేదీ కాషాయం జెండానే అని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…హుజురాబాద్ ఒక్కటే కాదు రాష్ట్రమంటా టీఆర్ఎస్ వ్యతిరేక పరిస్థితి ఉందని తెలిపారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరన్నారు. ప్రజల్లో బలమున్నవారు ఇలా చెయ్యరని చెప్పారు. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుందని…. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు. 0.5శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క హుజురాబాద్ నియోజక వర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కుల సంఘం భవనాలు ఇస్తాం అంటూ మభ్య పెట్టడం సరికాదన్నారు. ఇంటింటికి లోన్లు ఇస్తాం, మహిళ సంఘాలకు సహాయం చేస్తాం అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటల ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన కేసీఆర్.. ఈటెల రాజేందర్ ను మోసం చేసిన విషయం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలు హుజురాబాద్ వైపు చూస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు గురు తరమైన బాధ్యత భుజాల మీద వేసుకొని, ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందామని ఈటట రాజేందర్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలో కమలం గుర్తును గెలిపించడంలో క్రియశీలకంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Read Also…

YV Subbareddy: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు.. రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమాకం!

‘చట్టం చేతులు చాలా పెద్దవి’..నిజమే ! యూపీలో క్రిమినల్ చేతిని పట్టుకుని పోలీసుల ‘బైక్ రైడింగ్’ !