
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో భయానక ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం అనుమానంతో భర్త భార్యను గొడ్డలితో నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్ధన దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల గోవర్ధన మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో దంపతుల మధ్య విభేదాలు చెలరేగాయి. భర్త రామారావు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో చర్చించినా గోవర్ధనలో మార్పు రాకపోవడంతో ఆయన తీవ్ర ఆవేశానికి గురయ్యాడు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రామారావు భార్య గోవర్ధనపై గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన గొడ్డలితో సహా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలు గోవర్ధనకు ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.