
నంద్యాల జిల్లా అబండతండాకు చెందిన శివకృష్ణకు కవితతో 15ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకి ముగ్గురు పిల్లలు. కుండలు తయారు చేసి అమ్ముతూ.. వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ మధ్య భార్యతో గొడవ పడుతున్నాడు. వేరొకరితో సంబంధం అంటగట్టి వేధిస్తున్నాడు. అనుమానం పెనుభూతమై.. మంగళవారం మధ్యాహ్నం ఇంటికొచ్చి మళ్లీ భార్యతో తగువుకి దిగాడు. సహనం కోల్పోయిన శివకృష్ణ.. రోకలిబండతో మోది భార్యను హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. భార్యను చంపిన శివకృష్ణ జైలుకెళ్లడంతో ముగ్గురు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది.
అటు కామారెడ్డి జిల్లాలోనూ ఇంచుమించు ఇలాంటి ఘటనే జరిగింది. బిచ్కుంద మండల కేంద్రంలో అడికే రమేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. గుండేవార్ కాశీనాథ్ భార్యకి అడికే రమేష్ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. మ్యాటర్ భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇంట్లో భార్యతో పాటు రమేష్ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యపై దాడి చేసేలోపే పారిపోయింది. దీంతో రమేష్‌పై కత్తితో దాడి చేసి చంపేశాడు కాశీనాథ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతున్న జీవితాలు.. చివరికిలా విషాదాంతమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి