Telangana: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా కమ్మిన పొగలు

|

Sep 17, 2021 | 11:01 AM

బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Telangana: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా కమ్మిన పొగలు
Fire Accident
Follow us on

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు అంతకంతకు పెరిగి గోదాం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను ఆవహించింది. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బందిని పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. గోదాంలో సామగ్రి మొత్తం కాలిబూడిదైనట్టు తెలుస్తోంది. ఓ వైపు మంటలు.. మరోవైపు పొగ.. వ్యాపించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఆస్థినష్టం భారీగా జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

 

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పేలుడు

పశ్చిమగోదావరిజిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వీరవాసరం మండలం రాయకుదురులో బాణాసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్‌ జరిగింది. ఐతే ఆ ఇంట్లో అనధికారకంగా బాణాసంచా తయారుచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీపావళి దగ్గరపడుతుండటంతో గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా ఇళ్లలోనే బాణాసంచా తయారు చేస్తున్నారు. తాజాగా రాయకుదురులో జరిగిన పేలుడులో భారీ ఆస్తినష్టం జరిగింది.
పేలుడు ధాటికి బాణాసంచా తయారు చేస్తున్న ఇంటితో పాటు..చుట్టుప్రక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఐతే పేలుడు సమయంలో చుట్టుప్రక్కల ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించిన ఇంటిని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రాజును చూశా.. రూ10 లక్షలు ఇచ్చేస్తారా..?.. ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిస్తే షాక్ తింటారు

కూల్ సిటీ కాకినాడలో కాక రేపుతున్న రాజకీయాలు.. తదుపరి మేయర్ ఎవరంటే..?