
తెలంగాణలోని కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తోంది. శనివారం సాయంత్రం ఆమె కుమారుడితో కలిసి బైక్‌పై ఖానాపూర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని వాహనానికి కట్టారు. అయితే కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి కిందపడటాన్ని వారు గుర్తించలేదు.
అదే సమయంలో రాచాపూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన ఆటోలో ప్రయాణికులతో నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తుండగా.. వడ్యాల్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు సౌజన్య రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించి డ్రైవర్‌కి తెలిపింది. వెంటనే సాయికుమార్ సంచిని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు.
Also Read: పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా..
తర్వాత బంగారం పోయిందని సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని చూసిన సౌజన్య తన భర్త ద్వారా సాయికుమార్‌కి సమాచారం అందించింది. ఆదివారం సుజాతకు సమాచారం చేరగానే.. ఆమె వచ్చి తన బంగారం, నగదు, పత్రాలను తిరిగి తీసుకుంది. ఆటో డ్రైవర్ సాయికుమార్ నిజాయతీని మెచ్చుకున్న గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.