తవ్వేకొద్దీ అక్రమాస్తుల డొంక.. శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

హెచ్ఎండీఏలో కలకలం రేపిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో తవ్వే కొద్దీ గుట్టలు గుట్టలుగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఏ కంపెనీలకు, ఎవరెవరికి శివ బాలకృష్ణ అక్రమంగా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారు అనే విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఇప్పటిదాకా బయటపడిన ఆస్తులు, పత్రాల ఆధారంగా శివ బాలకృష్ణ కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 400 కోట్లకుపైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తవ్వేకొద్దీ అక్రమాస్తుల డొంక.. శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Shiva Balakrishna

Edited By:

Updated on: Jan 27, 2024 | 8:22 PM

తవ్వేకొద్దీ అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఏసీబీ దర్యాప్తులో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి లీలలు క్యూ కడుతున్నాయి. TV9 చేతిలో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్. 45పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ సంచలన విషయాలను పేర్కొంది. అలాగే అతను దర్యాప్తుకు సరిగా సహకరించడంలేదన్నారు ఏసీబీ అధికారులు.

శివబాలకృష్ణ 1994లో గ్రూప్-1 క్యాడర్ లో సర్వీస్ లోకి వచ్చారు. అనంతపురం, గుంటూరు, వైజాగ్, GHMC, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు నిర్వహించారాయన. 2021నుండి 2023వరకు HMDA డైరెక్టర్ గా పనిచేశారు. ఈ టైమ్‌లోనే ఆయన అక్రమాస్తులు ఆమాంతం పెరిగాయి. ఏసీబీ తనిఖీల్లో ఆయన ఇంట్లో 120 చేతి గడియారాలను సీజ్‌ చేశారు ఏసీబీ అధికారులు. వాటి విలువ దాదాపు 33 లక్షలు. శివబాలకృష్ణ వుంఉటన్న ఇల్లు సహా మొత్తం 18 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది ఏసీబీ.

భారీగా నగలు, నగదు సహా 50కిపైగా ప్రాపర్టీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. దాదాపు 5 కోట్ల స్థిరాస్తులు, 8కోట్లకు పైగా చరస్తులను గుర్తించారు. డాక్యుమెంట్ల ప్రకారం ఆస్తుల విలువ పది కోట్లు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ పదిరెట్లు ఉంటుందని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది ఏసీబీ

ఇక పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూ లోవిల్లా , సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శేరిలింగంపల్లి లో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి ,చేవెళ్ల లో ప్లాట్స్, నాగరకర్నూల్ లో13ఎకరాలు, చేవెల్ల, అబ్దుల్లాపూర్ , భువనగిరి,యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్, భారీగా భూములు, ప్లాట్స్ కూడా ఉన్నట్టు గుర్తించింది ఏసీబీ . సోదాల్లో 99 లక్షల హార్డ్‌ క్యాష్‌ను స్వాధీనంచేసుకున్నారు ఏసీబీ అధికారులు. 51 లక్షల విలువ చేసే నాలుగు కార్లు..58 లక్షల బ్యాంక్‌ బాలెన్స్‌. గుర్తించారు.. స్వాదీనం చేసుకున్న ఆపిల్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌, వాచ్‌లు,ఇతరాత్ర ఖరీదైన వస్తువుల విలువ 8 కోట్లకు పైగా వుంటుందని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

శివబాలక్రిష్ణ బినామీలపై దృష్టి సారించింది ఏసీబీ. అతని సోదరుల ఇళ్లు సహా హిమాయత్‌నగర్‌లో శివరామకృష్ణ బంధువుల ఇళ్లను తనిఖీ చేశారు. కీలక డాక్యుమెంట్స్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్స్‌ను, లాకర్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..