TSPSC: సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో దర్యాప్తు చేయాలి.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారించనున్న హైకోర్టు

| Edited By: Ravi Kiran

Mar 21, 2023 | 11:40 AM

సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలని పిటిషనర్ అభ్యర్తించారు. అభ్యర్థులతో పాటు పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఎస్‌యుఐ. పిటిషనర్ల తరుపున ఎన్ఎస్‌యుఐ లీగల్ ఇంఛార్జి వికాస్ దన్కే..

TSPSC: సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో దర్యాప్తు చేయాలి.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారించనున్న హైకోర్టు
TSPSC
Follow us on

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలని పిటిషనర్ అభ్యర్తించారు. అభ్యర్థులతో పాటు పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఎస్‌యుఐ. పిటిషనర్ల తరుపున ఎన్ఎస్‌యుఐ లీగల్ ఇంఛార్జి వికాస్ దన్కే వాదించనున్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందంటున్నారు పిటిషనర్లు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తముందని ఆరోపించారు పిటిషనర్లు. ఇదే కేసులో మరో పిటిషన్ దాఖలు చేశారు నిందితుడు రాజశేఖర్ భార్య. తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సుచరిత. పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారించనున్న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్.

అయితే, పేపర్ లీకేజీ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ విషయమై కమిషన్ ఏర్పాటు చేయాలని సుచరిత కోర్టును అభ్యర్తించారు.

సుచరిత అభ్యర్థనపై పోలీసులు స్పందించారు. రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసులు శాఖ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం