Telangana: ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు

కొమురంభీం జిల్లాలో ఫిబ్రవరి 22న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎర్రటి ఎండ ఉండాగానే కురిసిన అకాల వర్షం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు సూర్యుడు సుర్రుమంటున్న సమయంలో ఈ జోరు వానలేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Telangana: ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు
Komaram Bheem Rains

Edited By:

Updated on: Feb 22, 2026 | 8:17 PM

కొమురంభీం జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతవరణంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.  సడెన్‌గా భారీ వర్షం కురవడంతో జనం పరుగులు తీశారు. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు సూర్యుడు సుర్రుమంటున్న సమయంలోనే మరో వైపు వరుణుడు జోరు వాన కురిపించడంతో విచిత్ర వాతవరణంతో జైనూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు అకాల వర్షాల కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్ పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలో భారీ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని సూచించింది.

వచ్చే వేసవిలో ఈ ఏడాది రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారంలోనే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మధ్యాహ్నం 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని. మరో వారం రోజుల్లో ఈ ఉష్ణోగ్రత మరో మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతవరణ శాఖ.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us