
తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. రేపటి కల్లా నైరుతి రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. రాగల రెండు రోజులలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురవనుండగా.. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో బుధవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా