Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..

|

Jul 12, 2021 | 7:24 PM

Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనాలు..

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. జలమయం అయిన పలు ప్రాంతాలు..
AP Rains
Follow us on

Telangana Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మాదాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దాంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఇదే మాదిరిగా కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Rains Live:

Also read:

Revanth Reddy: కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.. ఇంటి దొంగలను వదిలబోనుః రేవంత్‌రెడ్డి

ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..

MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్..