Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. కొన్ని చోట్ల మోసర్త వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఎల్బీనగర్, నాగోల్, వనస్దలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పెట్, అబ్దుల్లా పుర్ మెంట్ పరిధిలలో భారీ వర్షం కురిసింది. అలాగే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఉదయం నుండి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు భారీ వర్షం మొదలైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బుధవారం నాడు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కూడా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్, పంజాగుట్ట, దిల్‌సుఖ్ నగర్, కోఠీ తదితర ప్రాంతాలలో వర్షం దంచికొట్టింది. దాదాపు గంటపాటు నాన్‌స్టాప్‌గా వాన కురిసింది.
Also read: