Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులు అలెర్ట్..

|

Aug 29, 2021 | 4:49 PM

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని ప్రాంతాల్లో...

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులు అలెర్ట్..
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలో చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర పశ్చిమ పరిసర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో బెంగాల్ తీరం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ వద్ద 3.1 కిలోమీటర్ల వద్ద ఇంకో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు. దీంతో రాగల 4 రోజులు పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

అటు ఏపీకి భారీ వర్షసూచన ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. అలాగే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉండటం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, జిల్లాస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్… ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో

 వర్షాకాలంలో ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి.. లేదంటే అనారోగ్యానికి గురికాక తప్పదు