AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బావిలో పడిపోయిన దూడ.. కాపాడడానికి వెళ్లిన తండ్రీకొడుకులు.. స్పాట్‌లోనే..

ఒక మూగజీవిని రక్షించాలన్న ఆ తండ్రీకొడుకుల మానవత్వమే వారి పాలిట మృత్యుపాశమైంది. దూడ ప్రాణం కాపాడి తండ్రి బావిలోనే ఒరిగిపోగా.. కళ్లముందే నాన్నను కోల్పోతున్నానన్న ఆరాటంతో దూకిన కొడుకు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ములుగు జిల్లా కార్లపల్లిలో జరిగిన ఈ ఘోరం ప్రాణాలను కాపాడే ప్రయత్నంలోనే ఇద్దరినీ బలితీసుకుంది.

Telangana: బావిలో పడిపోయిన దూడ.. కాపాడడానికి వెళ్లిన తండ్రీకొడుకులు.. స్పాట్‌లోనే..
Father And Son Death Mulugu
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 10, 2026 | 9:31 AM

Share

అది వారి దాహార్తిని తీర్చే బావి.. కానీ అదే వారి పాలిట కాలయముడిగా మారుతుందని ఆ తండ్రీకొడుకులు ఊహించలేదు. ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడాలనే వారి మానవత్వం.. చివరికి వారిద్దరినీ మృత్యుఒడికి చేర్చింది. ములుగు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు ఊరంతా బోరుమనేలా చేస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కార్లపల్లి గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రసపుత్ రాజు అనే రైతుకు చెందిన లేగదూడ ప్రమాదవశాత్తు వారి ఇంటి ఆవరణలోని మంచినీటి బావిలో పడిపోయింది. తన కళ్ల ముందే ప్రాణాపాయంలో ఉన్న లేగదూడను చూసి రాజు తల్లడిల్లిపోయాడు. ఎలాగైనా దాన్ని కాపాడాలని నిర్ణయించుకుని 35 అడుగుల లోతు ఉన్న ఆ బావిలోకి దిగాడు.

మృత్యుపాశమైన ఆక్సిజన్ లేమి

బావిలోకి దిగిన రాజు, తన ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో లేగదూడను సురక్షితంగా పైకి పంపాడు. అయితే దూడ ప్రాణం దక్కిన ఆ క్షణమే కాలం రాజుపై పగబట్టింది. బావి లోపల ఆక్సిజన్ అందకపోవడంతో రాజు అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పైనే ఉన్న కుమారుడు పవన్ (రక్షణ చర్యలు ఏవీ లేకుండానే) తన తండ్రిని కాపాడుకోవాలనే ఆరాటంతో వెంటనే బావిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు పవన్‌కు కూడా ఊపిరి అందలేదు. కళ్లముందే తండ్రీకొడుకులు ఇద్దరూ మృత్యువుతో పోరాడుతుంటే, కాపాడలేక కుటుంబ సభ్యులు, స్థానికులు చేసిన హాహాకారాలు కార్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు నింపాయి.

ముగిసిన సహాయక చర్యలు

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది సహాయంతో గంటల తరబడి శ్రమించి తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఊరంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మూగజీవిని కాపాడిన ఆ చేతులే ప్రాణవిహీనంగా పడి ఉండటం చూసి గ్రామస్థులు తట్టుకోలేకపోతున్నారు. ఒక చిన్న పొరపాటు, సరైన రక్షణ చర్యలు లేకపోవడం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

Follow Us