మంత్రి హరీష్‌రావు స్కూల్ టీచర్ అవతారం ఎత్తారు. సంగారెడ్డి జిల్లా కంది ఉన్నత పాఠశాలలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనం, వసతుల కల్పనపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులను ఆయా సబ్జెక్టులపై పలు ప్రశ్నలు అడిగారు.
పదో తరగతిలో మంత్రి హరీశ్‌రావు విద్యార్థులను ఎక్కాలు అడిగారు. విద్యార్థులు ఎక్కాలు చెప్పలేక పోయారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో పలువురి పేర్లను బోర్డుపై రాయించగా, విద్యార్థులు తెలుగులో కూడా పేర్లు సరిగా రాయక పోవడంపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారంటూ స్కూల్ టీచర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీలు, సెల్‌ఫోన్లు పక్కన బెట్టి, చదువుపై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ సారి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కంది పాఠశాల ఉత్తీర్ణతలో ముందంజలో ఉండాలని పాఠశాల హెడ్‌మాస్టర్‌ను ఆదేశించారు మంత్రి హరీష్‌రావు.