AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. గీత దాటేది లేదు..

బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్‌ కార్యకర్తను నేను.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. గీత దాటేది లేదు..
Harish Rao
Shaik Madar Saheb
|

Updated on: May 13, 2025 | 5:05 PM

Share

బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్‌ కార్యకర్తను నేను.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా, గీత దాటేది లేదు.. అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విబేధాలు లేవన్నారు. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. గీత దాటేది లేదంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం, వార్తలపై తాను అదే రోజు ఖండించానని హరీష్ రావు పేర్కొన్నారు. ‘‘కొన్ని వందలసార్లు చెప్పాను కేసీఆర్ మా పార్టీ అధ్యక్షులు.. వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని.. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటను.. మై లీడర్ ఈజ్ కేసీఆర్. వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో’’.. అంటూ హరీష్ రావు మంగళవారం మీడియాతో చెప్పారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ లేదన్నారగ.. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేస్తున్నారు.. రైతులు చనిపోతుంటే రివ్యూ చేసే సమయం లేదా..? అని ప్రశ్నించారు. అందాల పోటీలను మాత్రం సీఎం ఎంజాయ్ చేస్తున్నారు.. రైతుల కోసం క్షేత్రస్థాయిలో అధికారులను పంపాలి.. స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. పాక్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్‌కు మాత్రం అప్పు ఇవ్వడం లేదంటూ ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారు.. అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు.. వేలాదిమంది పోలీస్ లను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరమంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదన్నారు. కొన్న వడ్లకు 4 వేల కోట్లు బకాయి పడిందన్నారు. 48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారు. పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదన్నారు. బోనస్ ఊసే లేదు. యాసంగి పంటకు 512 కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నారు.. మేం 15,000 ఇస్తాం.. అన్నారని.. చివరకు ఏం లేకుండా చేశారన్నారు. చాలా మంది రైతులు చనపోయారని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..