Naveen Murder Case: నవీన్‌ హత్యోదంతంలో పోలీసుల చేతికి కీలక సమాచారం.. నిందితుడు హరిహర కృష్ణ పథకం ఇదే

|

Feb 28, 2023 | 8:17 AM

నల్గొండలో సంచలనంరేపిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవీన్‌ని హత్య చేసిన తీరు అత్యంత సంచలనంగా మారింది. తాజాగా హరి రిమాండ్‌ రిపోర్టులో మరిన్ని షాకింగ్‌ విషయాలు..

Naveen Murder Case: నవీన్‌ హత్యోదంతంలో పోలీసుల చేతికి కీలక సమాచారం.. నిందితుడు హరిహర కృష్ణ పథకం ఇదే
Naveen Murder Case
Follow us on

నల్గొండలో సంచలనంరేపిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవీన్‌ని హత్య చేసిన తీరు అత్యంత సంచలనంగా మారింది. తాజాగా హరి రిమాండ్‌ రిపోర్టులో మరిన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం నవీన్‌ను హత్య చేసినట్లు తేలింది. అందుకు హరి మూడు నెలల క్రితమే పథకం పన్నాడు. రెండు నెలల క్రితం షాపింగ్ మాల్లో కత్తి కొని, ఆ కత్తిని తన స్కూటీలో పెట్టుకుని అదును కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో పార్టీ పేరుతో జవవరి 16న హత్యకు కుట్ర పన్నాడు. అది ఫలించక పోవడంతో ఫిబ్రవరి 17న హత్యను అమలు చేశాడు. ఆ రోజు రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్‌ తిరుమల వైన్స్‌ వద్ద నవీన్‌, హరిహర కృష్ణ మద్యం సేవించారు. అనంతరం ఎల్బీనగర్‌, నాగోల్‌, ముసారంబాగ్‌, సైదాబాద్‌, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో నవీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నవీన్ ను తీసుకుని బ్రహ్మణపల్లికి వెళ్లాడు. అక్కడ రాత్రి 12 గంటల ప్రాంతంలో యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పర వాగ్వాదం జరిగింది.

ఈక్రమంలో కోపోద్రిక్తుడైన హరి తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేశాడు. అనంతరం కత్తితో నవీన్‌ శరీర భాగాలను వేరు చేశాడు. మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా శరీరంపై దుస్తులను సైతం తొలగించాడు. నవీన్ వేలు, పెదవులు, గుండె నరికి.. ఆ ఫోటోలను గర్ల్‌ ఫ్రెండ్‌కి మెసేజ్ పెట్టాడు. తర్వాత తలతో సహా శరీర విడిభాగాలను బ్యాంగ్‌లో తీసుకెళ్లాడు. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్‌ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్‌ రిపోర్టు ద్వారా తెలిసింది. ప్రియురాలిని కూడా కలిసి నవీన్‌ హత్య గురించి తెలిపాడు. ఆమె పోలీసులకు లొంగిపోవాలని చెప్పినా వినకుండా వరంగల్‌ వెళ్లినట్లు వెల్లడైంది. ఫిబ్రవరి 24న తిరిగి హత్యజరిగిన ప్రాంతానికి వచ్చి నవీన్‌ శరీర భాగాలతోపాటు ఆధారాలు దొరకకుండా తగలబెట్టి.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు లొంగిపోయినట్లు రిమాండ్‌ రిపోర్టు ద్వారా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.