Self Watering Plant: మొక్కకు ఆటోమాటిక్‌గా అందుతున్న నీళ్లు.. వరంగల్ విద్యార్థి అద్భుత ఆవిష్కరణ..!

|

Jan 23, 2022 | 9:46 AM

Self Watering Plant: ప్రతి రోజూ గుర్తుపెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలంటే కొంచెం కష్టమైన పనేకదా..!

Self Watering Plant: మొక్కకు ఆటోమాటిక్‌గా అందుతున్న నీళ్లు.. వరంగల్ విద్యార్థి అద్భుత ఆవిష్కరణ..!
Follow us on

Self Watering Plant: ప్రతి రోజూ గుర్తుపెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలంటే కొంచెం కష్టమైన పనేకదా..! మొక్కలకు అవసరమైనప్పుడు నీళ్లు వాటంతటవే కుండీలో పడితే బాగుంటుంది. కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణ చేశాడు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర గణేశ్ అనే యువకుడు వినూత్న ఏర్పాటు చేశాడు..’సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్‌కు ప్రాణం పోశాడు.

ఇదిగో..ఇలా, మొక్క ఉండే కుండీ కింద ఒక డబ్బా ఉంటుంది. మొక్కకు నీరు అవసరమని సెన్సర్లు గుర్తించినప్పుడు అందులోని నీళ్లు పైకి వచ్చి కుండీలో పడతాయి. ఈ సెన్సర్లు బ్యాటరీతో పనిచేస్తాయి. వారానికోసారి డబ్బాలో నీళ్లు మారిస్తే చాలు.. మొక్కకు అవసరమైనప్పుడల్లా నీళ్లు అందుతాయి. కుండీ నిండిన వెంటనే నీళ్లు తిరిగి డబ్బా లోకి వెళ్లిపోతాయి. ఒక్కోదానికి 500రూపాయల లోపే ఖర్చ అవుతుందని చెబుతున్నాడు గణేశ్.

గణేష్‌ గతంలోనూ పలు ఆవిష్కరణలు చేశానని చెబుతున్నాడు.. ఇంటర్ వరకే చదివినా, తనలోని ఆవిష్కర్తను చూసి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వారు తమ ఇంక్యుబేషన్ కేంద్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పాడు.

Also read:

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే