ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి.. లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః రేవంత్‌రెడ్డి

|

Sep 11, 2024 | 3:13 PM

దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి.. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయన్నారు.

ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి.. లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy
Follow us on

దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి.. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే కట్టుబడి ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమించిన వాళ్లలో ఎంత గొప్ప వాళ్లు ఉన్నా వాళ్లు చెరువులను వదలక తప్పదని హెచ్చరించారు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ పోలీసు అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన అందులోని ఇండోర్‌ స్టేడియంలో కాసేపు షటిల్‌ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…