AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మరో 547 ఎస్సైలు.. వీరిలో ఎక్కువ మంది చదివింది ఇదే!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని పరేడ్‌లో పాల్గొన్నారు...

Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మరో 547 ఎస్సైలు.. వీరిలో ఎక్కువ మంది చదివింది ఇదే!
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 11, 2024 | 1:47 PM

Share

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని పరేడ్‌లో పాల్గొన్నారు.

అత్యధికంగా మహిళ ఎస్‌ఐలు

పోలీస్ అకాడమీ నుండి 547 మంది ఎస్ఐలు పాస్ అవుతున్నారు. వీరిలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు 145 మంది. పురుష సబ్ ఇన్స్పెక్టర్లు- 402 మంది. ఈ మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో 401 మంది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. ఏ ఆర్ఎస్ఐలు గా 71 మంది, టీజీఎస్‌పీ (RSI)లు 29 మంది, ఐటీసీ ఎస్ఐలు 22 మంది ఎస్ఐలు ఉన్నారు.

ఎక్కువ మంది ఎస్ఐలు చదివింది ఇదే..

547 మంది ఎస్ఐలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దాదాపు 472 మంది గ్రాడ్యుయేట్ లు ఉండగా , పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లు 75 మంది ఉన్నారు. ఈ 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో 248 మంది బిటెక్ విద్యార్హత కలిగి ఉన్నారు. 221 మంది డిగ్రీ వరకు చదువుకున్నారు. 26 మంది ఎంటెక్ పూర్తి చేయగా, 18 మంది ఎంబీఏ చదువుకున్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పల్లి భాగ్యశ్రీ నేతృత్వం వహించారు. పరేడ్‌ 26 నుండి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. వీరిలో మొత్తం 283 మంది 26 నుండి 30 ఏళ్ల వయసు వారు ఉండగా, 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు 182 మంది ఉన్నారు. 58 మంది ఎస్ఐలు 31-35 వయసు వారు ఉండగా, 24 మంది 36-42 ఏళ్ల వయసు వారు ఉన్నారు.

11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు:

వరదల కారణం నష్టాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు చెక్‌ను అందజేశారు.

Telangana Police Academy

Telangana Police Academy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. 20 లక్షల కేసులు?
అక్కడ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. 20 లక్షల కేసులు?
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
స్టూడెంట్‏ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..
పిల్ల బచ్చాలనుకు బరిలోకి దిగితే, దూల తీరిపోద్దంతే..
పిల్ల బచ్చాలనుకు బరిలోకి దిగితే, దూల తీరిపోద్దంతే..
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
మీ వంటగదిలోని ఈ పదార్థం గుండెకు ఆల్కహాల్ కంటే డేంజర్..
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
ఆదిమానవుల ఎగ్ కర్రీ.. నిప్పులపై ఇలా చేస్తే అదిరిపోతోంది
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
కాటేరమ్మ కొడుకు ఔట్.. బ్యాడ్ లక్కోడికి లక్కీ ఛాన్స్..?
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం
ఫైసా ఖర్చులే.. ఈ సీక్రెట్‌ ఫేస్‌ ప్యాక్‌తో అదిరిపోయే అందం మీసొంతం