TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..

|

Jan 14, 2021 | 7:43 PM

TRS Party: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి ఎదరైంది. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన

TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..
Follow us on

TRS Party: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి ఎదరైంది. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల లొల్లి మొదలైంది. నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మరోవర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓల్డ్ బ్యాచ్ ఆమేరకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన మంత్రి కేటీఆర్.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నేరుగా రంగంలోకి దిగారు. మండలాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఇవాళ కొన్ని మండలాల నేతలతో సమావేశం అవగా.. శుక్రవారం, శనివారం మరో రెండు మండలాల నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు.

ఇదిలాఉంటే, టీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల లొల్లి ఒక్క సిరిసిల్ల నియోజకవర్గానికే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీలో నేతలు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు ఆదిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ఫలితంగా పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు కూడా. రాష్ట్రంలో ఇతర పార్టీలు బలపడుతున్నందున పార్టీలో చిన్న చిన్న ఘర్షణలను సద్దమణిగేలా చర్యలు చేపట్టాలని నేతలు కేటీఆర్‌ను కోరారు. తాజాగా కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఎదురవడంతో ఆయన అలర్ట్ అయ్యారు. ముందుగా సిరిసిల్లలో పరిస్థితిని చక్కబెట్టి.. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులపై ఆరా తీస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also read:

Sankranti: అదిగదిగో మకరజ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన శబరి గిరులు TV9 ప్రత్యక్షప్రసారంలో వీక్షించండి..

Ganta Srinivasa Rao: ఆర్కే బీచ్‌ రోడ్డులో మాజీ మంత్రి సందండి.. స్నేహితులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేస్తూ..