Telangana: మరికాసేపట్లో పెళ్లి.. పీటలపై పెళ్లికూతురు.. కట్ చేస్తే.. వరుడు చేసిన పనికి అంతా షాక్

మరికాసేపట్లో పెళ్లి.. వేడుక సర్వం సిద్దం. పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి.. మండపం దగ్గరకు వచ్చింది. సీన్ కట్ చేస్తే.! వరుడు జంప్ అని వార్త.. దెబ్బకు అందరూ షాక్.. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Telangana: మరికాసేపట్లో పెళ్లి.. పీటలపై పెళ్లికూతురు.. కట్ చేస్తే.. వరుడు చేసిన పనికి అంతా షాక్
Marriage

Edited By:

Updated on: May 16, 2025 | 6:11 PM

అందరూ పెళ్లి హడావుడిలో మునిగి తేలుతున్నారు. వధువు ముస్తాబైంది. వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ.! వరుడు తరపున బంధువులు కూడా రావడం లేదు. ఇంతలోనే గుండె పగిలే వార్త. వరుడు వేరే అమ్మాయిను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం తెలియడంతో ఒక్కసారిగా పెళ్లి పందిరి మూగపోయింది. అందరూ షాక్‌కు గురైయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డి ఓ అమ్మాయిను మోసం చేశాడు. పెళ్లి రోజే హ్యాండ్ ఇచ్చాడు. నిశ్చితార్ధం చేసుకున్న అమ్మాయి కాకుండా.. మరో అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. దీంతో అమ్మాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిచ్చితార్థం మహేందర్ రెడ్డికి జరిగింది. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. మరో అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

ఇవి కూడా చదవండి

రంగాపూర్‌కి చెందిన కుంట మధుకర్ రెడ్డి అనే యువకుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ కాట్రపల్లికి చెందిన యువతితో రూ. 40 లక్షల విలువైన అర ఎకరం భూమి, 10 తులాల బంగారం, 6 లక్షల నగదుతో పెళ్లి నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే శనివారం ఆ అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయం మరో అమ్మాయిని మధుకర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అబ్బాయి తండ్రి ఏమి చేసుకుంటారో చేసుకోమని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నాడంటూ వాపోయారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.