Sadar Festival: భాగ్యనగరంలో సదర్ సందడి.. యాదవులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న మంత్రి తలసాని

నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్‌ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. యాదవులతో కలిసి డ్యాన్స్‌ చేశారు ప్రజా ప్రతినిధులు.

Sadar Festival: భాగ్యనగరంలో సదర్ సందడి.. యాదవులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న మంత్రి తలసాని
Sadar Festival 2022

Updated on: Oct 27, 2022 | 1:21 PM

భాగ్యనగరంలో సదర్‌ వేడుక అంబరాన్నంటింది. నగరానికే తలమానికమైన సదర్ సంబరాలు ఈసారి కూడా హైలైట్‌గా నిలిచాయి. దున్నపోతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదర్ ఉత్సవాలు.. గ్లోరీ ఆఫ్ హైదరాబాద్‌లలో ఒకటి. ఆ ఊపు.. రూపు.. షేపు.. నగరంలో దీపావళి పటాకుల మోత ఒకెత్తయితే- ఆ తర్వాత జరిగే సదర్ సందడిలో కనిపించే దున్న పోతులు మరొక ఎత్తు. దీపావళి పండుగ తెల్లారి నిర్వహించే సదర్‌ సంబరాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రతియేటా నగరంలోని యాదవులు సదర్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెట్టారు యాదవులు. వాటిని సుందరంగా అలంకరించి ఊరేగించారు. వీటి వెంట ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో ఎంజాయ్ చేశారు కుర్రకారు. ఖైరతాబాద్, ఎల్లారెడ్డిగూడ, లాల్ బజార్, హిమాయత్ నగర్, సైదాబాద్‌తో పాటు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో సదర్ సంబరాలు వైభవంగా సాగాయి.

నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్‌ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. యాదవులతో కలిసి డ్యాన్స్‌ చేశారు ప్రజా ప్రతినిధులు. వచ్చే ఏడాది నుండి సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

గతంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ సదర్ ఉత్సవాలను ఇపుడు తెలంగాణవ్యాప్తంగా యాదవ సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారని తలసాని చెప్పారు. యాదవుల సంస్కృతి సంప్రదాయాలను ఈ వేడుకలు ప్రతిభింబిస్తాయన్నారు. ఈ సందర్భంగా దున్న రాజులతో యాదవులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..