Graduates MLC: ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది.. ఒక ఐడియాలజీతో ముందుకెళతా.. సురభి వాణీ దేవి ఫస్ట్ కామెంట్స్..

|

Mar 21, 2021 | 2:00 PM

Graduates MLC: ‘ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది’ అంటూ తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్..

Graduates MLC: ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది.. ఒక ఐడియాలజీతో ముందుకెళతా.. సురభి వాణీ దేవి ఫస్ట్ కామెంట్స్..
Surabhi Vani Devi
Follow us on

Graduates MLC: ‘ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది’ అంటూ తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణి దేవి తన సమీప ప్రత్యర్థిపై 51 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు ఆమె పీవీ ఘాట్‌ను సందర్శించారు. పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాణీ దేవి.. తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నా మీద పెద్ద బాధ్యత ఉందని తెలుసు. అన్నీ ధైర్యంగా ఎదుర్కొంటాను. ఒక ఐడియాలజీతో అన్ని సమస్యలను పరిష్కరిస్తా.’ అని చెప్పుకొచ్చారు. గణమైన మెజారిటీతో తనను గెలిపించినందుకు వాణి దేవి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ తమ భుజాలపై వేసుకుని తనను గెలిపించారని అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఇంత పెద్ద బాధ్యత తనపై పెట్టారని, అవన్నీ తాను సమర్థవంతంగా ఎదుర్కొంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. పీవీ దేశ ప్రజలకు చేసిన సేవను మర్చిపోలేనని అన్నారు. తన తండ్రి ఘాట్ నుంచే ప్రచారం మొదలు పెట్టానని, గెలిచి మళ్లీ ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంగా వాణి దేవి భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.

ఇదిలాఉంటే.. నల్గొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీ దేవి భారీ మజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,89,339 ఓట్లు పొందిన సురభి వాణీ దేవి.. 51,773 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి, బీజేపీ క్యాండిడేట్ రామ్‌చందర్ రావుపై ఘన విజయం సాధించారు. ఇక సిట్టింగ్ స్థానమైన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 49,362 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. మొత్తంగా రెండు చోట్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీలో ఫుల్ జోష్ వచ్చి చేరినట్లయింది.

Also read:

అరణ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేస్తున్న వెంకీ మామ : Aranya Movie Pre Release Event LIVE video.

మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా..! అయితే ఈ విషయాలు తెలియకపోతే కష్టం.. ఒక్కసారి పరిశీలించండి..