రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా, దాడి చేస్తే రక్తంతో చరిత్ర రాసుకుంటా: గవర్నర్ తమిళిసై

Telangana: ‘ఎవరైనా నా మీద రాళ్లు విసిరితే పునాదిగా మార్చుకుని కోట కడతా.. తరిమే వాళ్లను హితులుగ తలచి ముందుకెళ్తా..’ ఇవీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు. ఆమె ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి? రాజ్‌భవన్‌కి.. ప్రగతి భవన్‌కి మధ్య మళ్లీ ఏమైనా జరిగిందా..?

రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా, దాడి చేస్తే రక్తంతో చరిత్ర రాసుకుంటా: గవర్నర్ తమిళిసై
Governor Tamilisai

Updated on: Sep 30, 2023 | 10:04 PM

తెలంగాణ, సెప్టెంబర్ 30: ‘ఎవరైనా నా మీద రాళ్లు విసిరితే పునాదిగా మార్చుకుని కోట కడతా.. తరిమే వాళ్లను హితులుగ తలచి ముందుకెళ్తా..’ ఇవీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు. ఆమె ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి? రాజ్‌భవన్‌కి.. ప్రగతి భవన్‌కి మధ్య మళ్లీ ఏమైనా జరిగిందా..?

రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య రోజు రోజుకూ దూరం మరింత పెరుగుతోంది. తాజాగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎవరైనా తనపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటాననీ.. దాడిచేస్తే రక్తాన్ని సిరాగా చేసుకొని తన చరిత్ర రాసుకుంటానన్నారు. తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి ఇక్కడ మహిళా మంత్రులు లేరని, తాను వచ్చాకే మహిళా మంత్రులతో ప్రమాణం చేయించానని, అది సంతోషం కలిగించిందన్నారు తమిళిసై. ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతానన్నారు గవర్నర్‌. అలాగేఅందరూ అందరికీ నచ్చాలని లేదని, కానీ మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్నారు గవర్నర్‌. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.\

కాగా, దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. రాజ్యాంగంలో పేర్కొన్న అర్హతలకు తగ్గట్టుగా వారి అభ్యర్థిత్వాలు లేవంటూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో గవర్నర్‌ తెలిపారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను నామినేట్‌ చేయకుండా చూడాలని ముఖ్యమంత్రిని, కేబినెట్‌ను గవర్నర్‌ కోరారు. దీంతో గవర్నర్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్‌గా తమిళిసై నియామకం ఎలా జరిగిందో గుర్తుంచుకోవాలని, రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్‌ అయిన ఆమెకి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదంటూ కొందరు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..