111 G.O: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 84 గ్రామాలకు జీఓ 111 నుంచి విముక్తి..

| Edited By: Phani CH

Apr 20, 2022 | 9:01 PM

111 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేతస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. షరతులతో 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ 69వ నంబర్‌ను పుర‌పాల‌క శాఖ‌ ఉత్తర్వులు విడుదల చేసింది.

111 G.O: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 84 గ్రామాలకు జీఓ 111 నుంచి విముక్తి..
Telangana Government
Follow us on

111 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేతస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. షరతులతో 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ 69వ నంబర్‌ను పుర‌పాల‌క శాఖ‌ ఉత్తర్వులు విడుదల చేసింది. విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌, స‌మ‌గ్ర మార్గ‌ద‌ర్శ‌కాల కోసం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలో క‌మిటీని ఏర్పాటు చేసింది. జంట జ‌లాశ‌యాల ప‌రిర‌క్ష‌ణ‌, కాలుష్య నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. గ్రీన్ జోన్లు స‌హా జోన్ల నిర్ధార‌ణ కోసం విధివిధానాలు, ట్రంక్ వ్య‌వ‌స్థ అభివృద్ధి కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని ఆదేశించింది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవ‌ర్ష‌న్ డ్రైన్ల నిర్మాణానికి నిధుల స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని సూచించింది. వ‌స‌తుల క‌ల్ప‌న‌, నియంత్రిత అభివృద్ధి కోసం వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్న‌ది. లే అవుట్, భ‌వ‌న అనుమ‌తుల కోసం నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలిని సూచించింది. నియంత్రిత అభివృద్ధి స‌మ‌ర్థంగా జ‌రిగేలా న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల్లో మార్పులు చేయాల‌ని తెలిపింది.

ఇకపై జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా.. ఎస్టీపీల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా  భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోనున్నారు.

జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్‌. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డ్ ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, HMDA డైరెక్టర్ ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పన చేయనున్న సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ.

జంట జ‌లాశ‌యాల్లోకి మురుగునీరు చేర‌కుండా చ‌ర్య‌లు, మౌలిక వ‌సతుల క‌ల్ప‌న కోసం నిధుల స‌మీక‌ర‌ణ‌కు మార్గాలను అన్వేషించాల‌ని సూచించింది. వీలైనంత త్వ‌ర‌గా క‌మిటీ నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది..

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్