AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఒంటరిగా ఉంటుందని సాయం పేరుతో దగ్గరయ్యాడు.. సీన్ కట్ చేస్తే.. విగతజీవిగా మహిళ..

కొత్తలో దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉండేవాళ్లు. కారణాలేంటో కానీ ఆలుమగల మధ్య గొడవలొచ్చాయి. మ్యాటర్‌ విడాకుల వరకు వెళ్లింది. అనంతరం నాలుగేళ్ల కిందట

Khammam: ఒంటరిగా ఉంటుందని సాయం పేరుతో దగ్గరయ్యాడు.. సీన్ కట్ చేస్తే.. విగతజీవిగా మహిళ..
Women
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2022 | 9:13 PM

Share

లింగాల హర్షిత.. సొంతూరు ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలోని దిద్దుపూడి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లోని గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో లెక్చరర్‌. ఆమెకు పెళ్లయింది. కొత్తలో దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉండేవాళ్లు. కారణాలేంటో కానీ ఆలుమగల మధ్య గొడవలొచ్చాయి. మ్యాటర్‌ విడాకుల వరకు వెళ్లింది. అనంతరం నాలుగేళ్ల కిందట హర్షిత వైరా టీచర్స్‌ కాలనీలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. డైవోర్స్‌ కావడంతో ఒంటరిగా వుండేవారు.. ఈ క్రమంలో ఓ అమ్మాయిని దత్తతకు తీసుకున్నారు. వీకెండ్‌లో ఇంటికి వస్తూ వెళ్తుండేదామె. ఈక్రమంలోనే స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో పరిచయమైంది. ఒంటరిగా వున్న ఆమెకు అండగా ఉండేవాడతను. అడపాదడపా సాయం చేసేవాడు. అలా అలా పరిచయం పెరిగింది. ఈ ఇద్దరి అనుబంధం ఏంటనే గుసగుసలు గుప్పుమనే లోపే.. వీళ్ల పరిచయం మనీ మ్యాటర్స్‌తో మరింత ధృఢపడింది. మరోవైపు వీళ్లద్దరి క్లోజ్‌నెస్‌పై అతనింట్లో రచ్చ జరగడం.. అతని భార్య ఏకంగా గొడవకు దిగడం.. ఆ క్రమంలోనే దారుణం జరగడం సంచలనంగా మారింది.

రాత్రి ఏం జరిగిందో.. ఎవరొచ్చారో ..ఏంచేశారో కళ్లకు కట్టినట్టు చిన్నారి చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి. నరసింహరావు భార్య, ఇంకో వ్యక్తి రాత్రి హర్షితతో గొడవపడ్డారు. ఆటైమ్‌లో నరసింహరావుకు ఫోన్‌ చేశారు హర్షిత. కానీ ఆప్తమిత్రుడి నుంని రెస్పాన్స్‌ లేదు. కానీ తెల్లావారు జామున సీన్‌లోకి వచ్చి డ్రామా రక్తి కట్టించాడనేది హర్షిత బంధువుల ఆరోపణ.

నరసింహరావు అతని భార్య నరసమ్మ. తమ్ముడు వీరన్నే హర్షితను హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిజానిజాలు తేల్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకంటామన్నారు.

ఇవి కూడా చదవండి

సాయం పేరుతో సాన్నిహిత్యం.. ఆపై స్నేహం ముసుగులో లక్షల్లో ఆర్ధిక లావాదేవీలు.. కట్‌ చేస్తే ఓ నిండు ప్రాణం బలి. ఓ చిన్నారి భవితవ్యం ప్రశ్నార్ధకం. నేరం ఎవరిది- శిక్ష ఎవరికి? ఈ అనర్ధానికి కారణం వివాహేతర సంబంధమేనా? ఆర్ధిక వివాదాల నేపథ్యంలో కుట్రా? ఇక నిజానిజాలేంటో దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..