AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: బస్‌పాస్‌ తీసుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. ఆ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం.

రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్‌ దారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసింది. అంతేకాదు, టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా..

TSRTC: బస్‌పాస్‌ తీసుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. ఆ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం.
Tsrtc
Narender Vaitla
|

Updated on: Apr 03, 2023 | 5:29 PM

Share

రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్‌ దారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసింది. అంతేకాదు, టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్‌ దారులకు టోల్‌ప్లాజా రుసుం వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌ పాస్‌ చూపించి.. ప్రతి రోజూ టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. ఇక టోల్‌రుసుంతో పాటే నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేయనుంది. తెలంగాణలో ప్రస్తుతం 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి ‘మంత్లీ సీజన్‌ టికెట్‌’ పేరుతో పాస్‌లను సంస్థ ఇస్తోంది. నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఈ పాస్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పాస్‌ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని సంస్థ ఇస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ విషయమై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నెలవారీ బస్‌పాస్‌ల్లో గతంలో శ్లాబ్‌ విధానం అమల్లో ఉండేది. ఉదాహరణకు.. ఒకరు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్లాబ్‌ విధానం ద్వారా 55 కిలోమీటర్లకు నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేసేది. ఇక మీదట 51 కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, టోల్‌ప్లాజా రుసుం కూడా బస్‌పాస్‌లోనే ఉండనుంది. ఈ నిర్ణయం నెలవారీ బస్‌దారులకు ఎంతో మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి