AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పర్యాటకులకు గుడ్ న్యూస్.. సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం షురూ.. ఎప్పుడంటే..?

నాగార్జున సాగర్‌ - శ్రీశైలం ప్ర‌యాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. అలాంటి మధురానుభూతిని పర్యాటకులకు కల్పించేందుకు తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది.

Telangana: పర్యాటకులకు గుడ్ న్యూస్.. సాగర్ - శ్రీశైలం లాంచీ ప్రయాణం షురూ.. ఎప్పుడంటే..?
Sagar Srisailam Launch Journey
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 27, 2024 | 3:34 PM

Share

పర్యాటకుకు గుడ్ న్యూస్.. ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడాన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కోరుకుంటారు. నాగార్జున సాగర్‌ – శ్రీశైలం ప్ర‌యాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. అలాంటి మధురానుభూతిని పర్యాటకులకు కల్పించేందుకు తెలంగాణ టూరిజం శాఖ సిద్ధమైంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను పర్యాటకశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ నవంబర్ 2, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా 9848540371 లేదా 9848306435 నెంబర్లను సంప్రదించాలి. marketing@tgtdc.in కు మెయిల్ కూడా చేయవచ్చని పర్యాటకశాఖ పేర్కొంది.

 మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..