Telangana: తెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. జనవరి నుంచి ఉచితంగా ఆ ఐదు కిలోల బియ్యం పంపిణీ

|

Jan 11, 2023 | 2:01 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని రేషన్‌కార్డులకు కేంద్ర ప్రకటించిన ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ డిసెంబర్‌ నెలతో ముగిసింది. తర్వాత ఆ..

Telangana: తెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. జనవరి నుంచి ఉచితంగా ఆ ఐదు కిలోల బియ్యం పంపిణీ
Telangana Ration
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని రేషన్‌కార్డులకు కేంద్ర ప్రకటించిన ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ డిసెంబర్‌ నెలతో ముగిసింది. తర్వాత ఆ ఉచిత రేషన్‌ బియ్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు మోడీ సర్కార్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టేందుకు ముందుగా నిర్ణయించుకోగా, తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. జనవరి నెల నుంచి కేంద్రం ఇచ్చే ఆ ఐదు కిలోల బియ్యాన్ని తిరిగి పంపిణీ చేస్తున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికేందుకు సిద్ధం కాగా, జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే.. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికీ 5 కిలోల చొప్పునే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో జనవరి నెల నుంచి సంవత్సరం పాటు రేషన్‌‌‌‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియాన్ని బుధవారం నుండి రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, గతంలో కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు బియ్యం ఇచ్చేది. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున ఇచ్చేది. ఇకపై అన్ని కార్డులపైనా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పునే బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులు పేద ప్రజలకు ఆందోళన కలిగించింది. దీంతో కోత విధిస్తున్నట్లు ప్రకటించిన ఆ 5 కిలోల బియ్యాన్ని తిరిగి జనవరి 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

కాగా, గతంలో ప్రభుత్వం ప్రకటించిన 10 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు మోడీ సర్కార్‌ ప్రకటించింది. డిసెంబరు 23న ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్‌‌‌‌ సమావేశమై దేశవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ఈ జనవరి1 నుంచి 2023 డిసెంబర్‌‌‌‌ వరకు ఏడాదిపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి