Telangana Cabinet: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి రుణ మాఫీ.. పూర్తి వివరాలు మీకోసం..

|

Aug 01, 2021 | 7:46 PM

Telangana Cabinet: రైతు రుణాల మాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను..

Telangana Cabinet: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి రుణ మాఫీ.. పూర్తి వివరాలు మీకోసం..
Cm Kcr
Follow us on

Telangana Cabinet: రైతు రుణాల మాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను ఆగస్టు 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు మాఫీ చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయం ప్రధానంగా చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్‌కు ఆర్థిక శాఖ అందించగా.. దానిపై చర్చించింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల గత రెండు సంవత్సరాలుగా రూ.25 వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో.. ఆగస్టు 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు రూ. 50వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ ఆదేశించింది. ఈ నిర్ణయం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

ఇదిలాఉంటే.. వ్యవసాయంపై ప్రధాన చర్చించిన కేబినెట్.. సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై చర్చించింది. పత్తి సాగుపై ప్రత్యేకంగా చర్చించింది కేబినెట్. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

Also read:

Tokyo Olympics 2020 Live: కాంస్యం కోసం జరుగుతున్న పోరులో మొదటి మ్యాచ్‌ను గెలిచిన పీవీ సింధు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం..

భావ సారూప్యం గల అన్ని చిన్న పార్టీలనూ ఆహ్వానిస్తున్నాం…సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్