Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సిమెంట్, స్టీల్ ధరలపై భారీ ఊరట

తెలంగాణలో సొంత స్థలం ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేకపోతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఆశాజనకంగా మారింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తాజాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ మరో సానుకూల నిర్ణయం తీసుకుంది.

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సిమెంట్, స్టీల్ ధరలపై భారీ ఊరట
Indiramma Housing Scheme

Edited By:

Updated on: Jul 19, 2025 | 8:57 AM

తెలంగాణలో సొంత స్థలం ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేకపోతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఆశాజనకంగా మారింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తాజాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న సిమెంట్, స్టీల్ ధరల దృష్ట్యా ప్రభుత్వం.. మరో ముందడుగు వేసింది.

సిమెంట్, స్టీల్ ధరలు ఇటీవల గణనీయంగా పెరగడంతో నిర్మాణ ఖర్చు పేదలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, ఈ కీలక నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు తక్కువ ధరలకే అందించేందుకు పూనుకుంది.

ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే జిల్లాల స్థాయిలో కలెక్టర్లు కమిటీ ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సిమెంట్, స్టీల్ వంటి పదార్థాలకు ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించి.. అదే ధరకు లబ్ధిదారులకు అందేలా పర్యవేక్షిస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడుతుంది. ప్రజలు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఊరట లభిస్తుంది.

ఇకపై ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ లభించడంతో ఇంటి నిర్మాణం చేపట్టే వారికి ఆర్థిక భారం భారీగా తగ్గనుంది. ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతం చేస్తాయని.. రాష్ట్ర గృహనిర్మాణ లక్ష్యాలను త్వరితగతిన చేరుకునే అవకాశం ఉందని అంచనా. నిర్మాణ రంగంలో ఈ మార్పులు తీసుకురావడం ద్వారా పేదలకు తమ కలల ఇంటి నిర్మాణం సాధ్యమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..