తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో రేపు మరో ఎపిసోడ్.. కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమన్వయ సమావేశం

|

Aug 02, 2021 | 8:24 PM

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మరో ఎపిసోడ్. కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమన్వయ సమావేశం మంగళవారం జరగనుంది. గెజిట్‌ అమలుపై రెండు రాష్ట్రాల అధికారులతో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే..

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో రేపు మరో ఎపిసోడ్.. కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమన్వయ సమావేశం
Krishna And Godavari
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మరో ఎపిసోడ్. కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్‌ బోర్డుల సమన్వయ సమావేశం మంగళవారం జరగనుంది. గెజిట్‌ అమలుపై రెండు రాష్ట్రాల అధికారులతో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే..ఈ సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు బోర్డుతో మీటింగ్‌ పెట్టాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. కో-ఆర్డినేషన్‌ కమిటీ తర్వాతే.. ఫుల్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తామని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు స్పష్టంచేసింది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ జారీ చేసిన తర్వాత మొదటిసారి కమిటీ భేటీ అవుతుంది. గెజిట్‌ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు భేటీలో పాల్గొననున్నారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన కమ్యూనికేషన్ ప్రకారం GRMB సభ్య కార్యదర్శి BP పాండే ప్రతిపాదిత సమావేశం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో జరుగుతుంది. ఎజెండాలో “జూలై 15, 2021 తేదీన గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడం.. పేర్కొన్న నోటిఫికేషన్ యొక్క వివిధ క్లాజుల అమలు కోసం ప్రారంభించిన చర్య యొక్క స్థితి.” 

గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టుల షెడ్యూల్‌లో మార్పులను ఏపీ అధికారులు కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోదావరి బేసిన్‌లోని 71 ప్రధాన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ జూలై 15 న కేంద్ర జల శక్తి (MoJS) గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..