కందకుర్తి వద్ద ఉగ్ర గోదావరి

|

Aug 19, 2020 | 8:38 PM

నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి చేరుతున్న వరద నీటితో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో గల పురాతన శివాలయం చుట్టూ నీటి మట్టం...

కందకుర్తి వద్ద ఉగ్ర గోదావరి
Follow us on

తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్ర నుంచి  తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నది కందకుర్తి ప్రాంతంలోనే ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరుగులు పెడుతుంది. కందకుర్తిలో వరద ప్రవాహం అధికంగా ఉంటే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు త్వరగా నిండుతుంది.

ఇక నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి చేరుతున్న వరద నీటితో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో గల పురాతన శివాలయం చుట్టూ నీటి మట్టం పెరుగుతున్నది. గోదావరి పరవళ్లు తొక్కుతూ కందకుర్తి త్రివేణి సంఘం వద్ద నీటి పరిమాణం పెరిగింది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఎవరు కూడా గోదావరి నదిని దాటేందుకు ప్రయత్నాలు చయవద్దని నది ప్రరివాహక ప్రాంతాల గ్రామస్థులను హెచ్చరించారు.