Telangana: గురుకులంలో విద్యార్థిని సూసైడ్.. అసలు ఏం జరిగింది

| Edited By: Ram Naramaneni

Nov 16, 2024 | 3:32 PM

ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో చోటుచేసుకుంది. స్వాతి స్వస్థలం లింగంపల్లి. ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి తెలియజేశారు.

Telangana:  గురుకులంలో విద్యార్థిని సూసైడ్.. అసలు ఏం జరిగింది
Swathi
Follow us on

సంగారెడ్డి (మం) కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న స్వాతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురుకులంలోని రెండవ ఫ్లోర్‌లో ఉదయం 6;30 నిమిషాలకు ఫ్యానుకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఉదయం రోజు మాదిరిగానే స్వాతి రోల్ కాల్‌కి కూడా హాజరై, పెండింగ్ వర్క్ ఉంది అని చెప్పి పైకి వెళ్లింది. తను ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థినిలు రూమ్‌‌కి వెళ్లి చూడగా.. రూమ్ లాక్ చేసి ఉంది. ఎంత కొట్టినా తలుపు తీయలేదు. విండోలో నుంచి చూడగా స్వాతి ఉరి వేసుకోని కనిపించింది. ఆందోళనకు గురైన విద్యార్థినిలు..  విషయాన్ని టీచర్ల కు తెలియజేయడంతో వాళ్ళు రూమ్ డోర్ బద్దలుకొట్టి.. ఉరి వేసుకున్న స్వాతిని కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలిసులు విషయాన్ని లింగంపల్లిలోని స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సంగరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకోని స్వాతి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదికాదు అని,ఇది ఆత్మహత్య కాదని ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పాఠశాల సిబ్బందిపై  ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు జోక్యం చేసుకుని స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులకు సర్ది చెప్పి..  మృతిపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.. ఇదే విషయంపై సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ.. స్వాతి మృతిపై కుటుంబసభ్యుల పై పిర్యాదు తీసుకున్నామని, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయనన్నారు. చదువు ఒత్తిడి కూడా కొంత కారణం అని తెలుస్తుంది అని, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయి అని ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..