హైదరాబాద్‎లోని ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం

| Edited By: Srikar T

Jun 26, 2024 | 6:24 PM

హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం.

హైదరాబాద్‎లోని ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
Hyderabad
Follow us on

హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు – 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం. కొన్నిచోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుంది. మరి కొన్నిప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీరు సరఫరా అవుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

NPA, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…