ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన మాటురి ప్రియాంకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన వుబ్బనపల్లి ప్రకాశ్ అనే సాఫ్ట్ వేరే యువకునితో పెళ్ళి కుదిరింది. అయితే ప్రకాష్ గత 06 ఏళ్లుగా జర్మనీ దేశంలోనీ ప్రాంక్ ఫర్ట్ ప్రాంతంలో సాప్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. అక్కడ ప్రకాష్ కు డానియెల్, పియా ఇద్దరు జర్మనీ దంపతులు మంచి స్నేహితులు అయ్యారు. భారత దేశం తెలంగాణలోని సత్తుపల్లి లో వివాహం చేసుకుంటున్న తన స్నేహిడైన ప్రకాష్, ప్రియాంక పెళ్లి వేడుక కోసం..ఎల్లలు దాటి వచ్చారు. విదేశీ కల్చర్ పక్కనపెట్టి చక్కగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు ధరించి పెళ్లి వేడుకలో పెదరాయుడు కుటుంబంలో హాజరయ్యారు.
స్నేహితుని పెళ్లిలో విదేశీ జంట సందడి..
స్నేహితుని పెళ్లి చూసేందుకు జర్మనీ దేశం నుంచి ఒక జంట సత్తుపల్లి వచ్చారు అని ఆ.. నోట…ఈ నోటా…తెలిసి అందరూ అవాక్కయ్యారు. అంతే కాదు వారిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. జర్మనీ దేశీయుల వస్త్రధారణ చూసి పెళ్లి వేడుకకు వచ్చిన వారు సంబర పడ్డారు. వేరే దేశం అయినప్పటికి భారత దేశ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పట్టుపంచ, కండువా, పట్టు చీరల తో జర్మనీ జంట కళ్యాణ మండపంలో తెగ సందడి చేసారు. పక్కన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే.. మనకెందుకు అనుకుంటున్న ఈరోజుల్లో ఎక్కడో జర్మనీ దేశం నుంచి స్నేహాన్ని గౌరవిస్తూ సత్తుపల్లి వచ్చి స్నేహితుని పెళ్లి వేడుకను కనులారా చూసి వెళ్ళడానికి వచ్చిన జర్మనీ దంపతులను చూసి మనవాళ్ళు చాలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు కొందరు పెళ్లికి వచ్చిన పెద్దలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..