Rajanna Sircilla: పల్లెలకు పాకిన గంజాయి మత్తు.. చిత్తవుతున్న యువత.. ఏకంగా 83 మంది అరెస్ట్‌..!

| Edited By: Jyothi Gadda

Oct 10, 2023 | 9:40 AM

Telangana: గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీసులు తెలిపారు. గంజాయి కేసులో పట్టుబడి జైల్ జీవితం గడిపి బయటకు వచ్చిన వారిపై నిఘా పెడతామని, గంజాయి కి బానిస అయిన యువకులకు..

Rajanna Sircilla: పల్లెలకు పాకిన గంజాయి మత్తు.. చిత్తవుతున్న యువత.. ఏకంగా 83 మంది అరెస్ట్‌..!
Rajanna Siricilla Police
Follow us on

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్10; రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడపడితే అక్కడ గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నారు. పోలీసులు ముమ్మర దాడులు చేపట్టగా భారీగా గంజాయి పట్టుబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరా నగర్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న మొహమ్మద్ హైదర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఇందిరా నగర్‌లో ఉంటున్న హైదర్ తన ఇంటి ముందు మేకల కోసం వేసిన షెడ్డును ఆనుకొని ఉన్న వెనుక వైపు పాత ఇల్లు గోడల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. అతడు కూడా గంజాయి సేవిస్తూ అమ్ముతున్నాడన్న పక్క సమాచారం తో పోలీసులు హైదర్ ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఇంట్లో సోదాలు చేయగా ఒక చిన్న పాటి కవర్ లో ఎండిన గంజాయి ఆకులు, హైదర్ సేవిస్తున్న పొగ గొట్టం స్వాధీనం చేసుకున్నారు. హైదర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చిన్న తనం నుండి గంజాయి చెట్లు పెంచుతున్నాడని తెలిసింది.

ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి హైదర్ తన ఇంటి ముందు తనిఖీలు చేయగా ఈ తనిఖీల్లో ఇంటి వెనకాల సాగుచేసిన 31 గంజాయి మొక్కలు బయటపడ్డాయన్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ, తంగళ్లపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు మధు, భాస్కర్ పంచనామా నిర్వహించి మొక్కలను పీకేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇతనిపై గతంలో గంజాయి విక్రయిస్తున్న కేసులు ఉన్నాయని తెలిపారు. హైదర్‌ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాల సాగు, రవాణాకు పాల్పడితే సహించేది లేదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సంవత్సరం ఇప్పటివరకు 32 కిలోల 204 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అక్రమంగా రవాణా చేస్తున్న, సేవిస్తున్న వారిని గుర్తించి 41 కేసులు నమోదు చేసి 83 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసి మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను, కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్నారని చెప్పారు. గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దనీ సూచించారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గంజాయి కేసులో పట్టుబడి జైల్ జీవితం గడిపి బయటకు వచ్చిన వారిపై నిఘా పెడతామని, గంజాయి కి బానిస అయిన యువకులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి యువత పెడదారి పట్టకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..