G Kishan Reddy: పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి… ఫ్యామిలీతో కలిసి కార్యాలయంలో పూజలు

| Edited By: Janardhan Veluru

Jul 08, 2021 | 12:32 PM

కేంద్రమంత్రిగా పదోన్నతి పొందిన గంగాపురం కిషన్‌ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కిషన్ రెడ్డితోపాటు

G Kishan Reddy: పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి... ఫ్యామిలీతో కలిసి కార్యాలయంలో పూజలు
Minister Kishan Reddy
Follow us on

కేంద్రమంత్రిగా పదోన్నతి పొందిన గంగాపురం కిషన్‌ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్న అనంతరం కార్యాలయంలో పనులను మొదలు పెట్టారు.  తెలంగాణ వచ్చాక కేంద్రంలో తొలి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి గుర్తింపు పొందారు. సాంస్కృతిక, పర్యాటకం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు కేటాయించారు.

హోంశాఖ సహాయమంత్రిగా 25 నెలల ఏడు రోజులు పనిచేసిన కిషన్‌రెడ్డి తాజాగా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కిషన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కింది. అదే ఏడాది మే 30 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతం నుంచి CH.విద్యాసాగర్‌ రావు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ కేంద్రంలో సహాయమంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల BJP నుంచి చూస్తే మాత్రం వెంకయ్యనాయుడు తర్వాత కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నది కిషన్ రెడ్డి మాత్రమే. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి MPగా విజయం సాధించారు.

విద్యార్థి దశ నుంచే కిషన్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. MPగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రి పదవి పొందిన కిషన్‌రెడ్డి తన పనితీరుతో మోడీని ఆకట్టుకున్నారు. కిషన్‌రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రిగా అనురాగ్‌ ఠాకూర్, రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవ్య, ఉక్కుశాఖ మంత్రిగా ఆర్‌సీపీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..