Gadwala: అడిషనల్ ఎస్పీ పై సస్పెన్షన్ వేటు.. మునుగోడు ప్రచారంలో పాల్గొన్నారని సీరియస్ యాక్షన్..

|

Nov 06, 2022 | 1:30 PM

గద్వాల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై వేటు పడింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయానికి..

Gadwala: అడిషనల్ ఎస్పీ పై సస్పెన్షన్ వేటు.. మునుగోడు ప్రచారంలో పాల్గొన్నారని సీరియస్ యాక్షన్..
Gadwala Additional Sp
Follow us on

గద్వాల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై  సస్పెన్షన్ వేటు పడింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. డీజీపీ కార్యాలయానికి రాములు నాయక్ ను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ నెల1 నుంచి రాములు నాయక్ సెలవులో ఉన్నారు. ఆ సమయంలో సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ లోకల్ లీడర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్ సమగ్ర విచారణ చేపట్టారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లు విచారణ లో వెల్లడైంది. ఈ అంశంపై డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. ఆరో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏడో రౌండ్‌ ఈవీఎంలు కౌంటింగ్‌ టేబుల్ పైకి చేరుకున్నాయి. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ కు 2,169 ఆధిక్యం లభిచింది. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. అయితే సీఈఓ తీరుపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కావాలనే ఫలితాల వెల్లడిని ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఆయన.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..