Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP vs Congress: తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..?

BJP vs Congress: తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
Bandi Sanjay Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2025 | 12:08 PM

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..? ఇలా.. రిపబ్లిక్‌డే ముగిసినా.. తెలంగాణలో పద్మ అవార్డులపై రాజకీయ రచ్చమాత్రం చల్లారడం లేదు. ఈ వ్యవహారంపై పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.

గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు పేర్లు..

పద్మ అవార్డుల కోసం గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ వీరిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు సీఎం రేవంత్‌. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు.

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కౌంటర్..

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. అయితే నక్సల్స్ భావజాలంతో ఎందరో బీజేపీ నేతలను చంపించిన గద్దర్‌లాంటి వ్యక్తులకు..పద్మ అవార్డులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. అలాంటి వ్యక్తులకు బరాబర్‌ అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పంపించిన పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న బండి.. అర్హులైన వారికే పద్మ అవార్డులు వస్తాయని తేల్చిచెప్పారు.

గద్దర్‌పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు..ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్. మాజీ నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌ లాంటి వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని ప్రశ్నించారు.

బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గద్దర్‌ పోరాటం చేశారన్న చామల.. గద్దర్‌పై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.

గద్దర్‌పై బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించారు..కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బుద్దిస్ట్‌ మీకు మావోయిస్టుగానే కనబడ్డారా? అని ప్రశ్నించారు. గద్దర్‌లోని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా? అని నిలదీశారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. పార్టీ విధానమా? చెప్పాలని డిమాండ్ చేశారు అద్దంకి.

అయితే.. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. భావజాలం వేరు మావోయిస్టుగా చేయడం వేరన్న బండి.. మావోయిస్టులతో ఈటలకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గద్దర్‌ అవార్డులను బీజేపీ వాళ్లు తీసుకోరని స్పష్టం చేశారు.

కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు..

అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్న వారికే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిరంజీవికి ఇస్తే, ఇప్పుడు బీజేపీ బాలకృష్ణకి ఇచ్చిందని విమర్శించారు కేఏ పాల్‌..

గద్దర్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్‌ సంచలన వ్యాఖ్యలు

గద్దర్‌కు, ఎల్టీటీఈకి పెద్దతేడా లేదంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు గద్దర్.. ఆయనపై అనేక కేసులు ఉన్నాయన్నారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి.. నిషేధిత మావోయిస్టు సంస్థలో ఉన్న గద్దర్‌కు.. అవార్డు ఎలా ఇవ్వమంటారు? ఎల్టీటీఈకి కూడా పద్మ అవార్డులు ఇవ్వాలని రేవంత్ అంటారా? అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై ఇప్పటికే మండిపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. లేటెస్ట్‌గా యూజీసీ, పద్మ అవార్డుల అంశంలోనూ మోదీ సర్కారు తీరును తప్పుబడుతోంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి