Telangana: నా భార్యను గెలిపిస్తే మీకు 5 సంవత్సరాలు కటింగ్, షేవింగ్ ఫ్రీ..

స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్న వేళ, సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లిలో ఓ వ్యక్తి ఇచ్చిన వినూతన హామీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం ...

Telangana: నా భార్యను గెలిపిస్తే మీకు 5 సంవత్సరాలు కటింగ్, షేవింగ్ ఫ్రీ..
Shivani Srikanth

Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2025 | 8:29 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నో హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల అన్ని పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు. కొంతమంది డబ్బు పంచడం, కొందరు చీరలు, వివిధ రకాల వస్తువులను బహుమతిగా అందిస్తున్నారు. మరి కొంతమంది ఊర్లో ఉన్న కోతులను పట్టడం.. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారింది.. తన భార్యను వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే ఆ వార్డ్‌లోని ప్రజలకు 5 సంవత్సరాలు ఉచిత కటింగ్ అంటూ ఆఫర్ ప్రకటించాడు. దుబ్బాక (మం) రఘోత్తంపల్లి గ్రామంలో శివాని అనే మహిళ గ్రామ వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే, వార్డులోని ప్రజలకు ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించారు ఆమె భర్త శ్రీకాంత్. ఇలా శ్రీకాంత్ ప్రకటించిన ఆఫర్‌పై అందరూ పెద్ద ఎత్తున్న చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.