AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉచితంగా ఇళ్లు అంటూ.. ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన మాయగాడు..!

తాను ఒక రిటైర్డు ఎంపీడీవోను అంటూ.. ఒక ఆర్గనైజేషన్ పేరుతో పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తానని ఒక ఎమ్మెల్యేను నమ్మించాడు. గ్రామంలో శంఖుస్థాపన కూడా చేయించాడు. తీరా చూస్తే తను ఒక మోసగాడు అని తెలిసి అవాక్కయ్యారు. పేదలకు ఇండ్లు కట్టిస్తానని మోసం చేసిన వ్యక్తి పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

Telangana: ఉచితంగా ఇళ్లు అంటూ.. ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన మాయగాడు..!
Cheater Arrest
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 27, 2024 | 1:10 PM

Share

మనం మనం బరంపురం.. మీది తెనాలే.. మాది తెనాలే.. ఇలాంటి సెంటిమెంట్‌ ఎక్కడైనా పనిచేస్తుంది. సరిగ్గా ఈ వీక్‌నెస్‌పైనే కొట్టి.. ఓ మాయగాడు ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడు. ఒక్కసారి అతని మాటలు నమ్మి ఐస్‌ అయిపోయినోళ్ల జేబులు ఖాళీ చేసేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మోసం చేయడంతోపాటు దాదాపు 20 మందిని ముంచాడు ఓ కేటుగాడు.

తాను ఒక రిటైర్డు ఎంపీడీవోను అంటూ.. ఒక ఆర్గనైజేషన్ పేరుతో పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తానని ఒక ఎమ్మెల్యేను నమ్మించాడు. గ్రామంలో శంఖుస్థాపన కూడా చేయించాడు. తీరా చూస్తే తను ఒక మోసగాడు అని తెలిసి అవాక్కయ్యారు. పేదలకు ఇండ్లు కట్టిస్తానని మోసం చేసిన వ్యక్తి పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలోని 20 మంది పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తాను అని నమ్మించాడు. ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఎంపీడీవోగా పని చేసి రిటైర్ అయ్యాను అంటూ నమ్మించాడు. అద్దంకి జనార్దన్ రావు అనే వ్యక్తి PS రావు అనే ట్రస్ట్ ద్వారా పేదలకు ఇండ్లు ఉచితంగా కట్టిస్తాను అని గ్రామస్తులను సైతం నమ్మించాడు. అంతే కాదు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిని సైతం మాటలతో మాయ చేశాడు. పాత కుప్పెనకుంట్ల గ్రామంలో ఒక 20 ఇండ్లు కట్టేందుకు జూలై 8వ తేదీన శంఖుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాగమయిని అతిథిగా ఆహ్వానించారు. అనంతరం పేదలకు ఇండ్లు ఉచితంగా కట్టివ్వాలి అంటే ఒక్కొక్కరి నుంచి 4 వేలు నగదు వసూళ్లు చేసి ముఖం చాటేశాడు. దీంతో అనుమానం కలిగిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో అతగాడు అసలు భాగోతం బయటపడింది. మాజీ ఎంపీడీవో అని చెప్పుకుంటున్న అద్దంకి జనార్దన్ రావుపై ఆంధ్రా లో ఐదు చోట్ల చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పెనుబల్లి పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసలు, అతగాడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?