తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ పీరియడ్ మొదలైంది. రాగల 48 గంటలపాటు బహిరంగ ప్రచారానికి అవకాశం లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టమని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. మూడు కోట్ల 32 లక్షల మంది ఓటర్లు, 35 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు సీఈఓ. ఒక కోటి 65 లక్షల మంది పురుష ఓటర్లు ఉంటే ఒక కోటి 67 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని వివరించారు. కొత్త ఓటర్లు 9 లక్షలకు పైచిలుకు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహణలో 1,95,000 మంది పోలింగ్ సిబ్బంది, 160 కేంద్ర బలగాలు. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల మంది పోలీస్ బలగాలు ఇప్పటికే రాష్ట్రంలో మొహరించాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐదు పార్లమెంటు పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అదిలాబాద్ పార్లమెంట్ లోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేటలో నాలుగు గంటలకు పోలింగ్ ముగుస్తోంది. మిగిలిన 106 స్థానాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగినట్లు తెలిపారు వికాస్ రాజ్. రేపు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలిక్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తరలిస్తామని చెప్పారు. ఇక ఈవీఎంలు తరలించే ప్రతి వాహనానికి జిపిఎస్ ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చినది ఈసి. పోలింగ్ శాతం పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఎలక్షన్ కమీషన్. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో 45 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 1లక్ష 90వేల మంది డైరెక్ట్ గా సిబ్బంది విధుల నిర్వహనలో పాల్గొన్నారు.
వచ్చే 48 గంటల పాటు ఏవైనా ఫిర్యాదులు వస్తే 100 నిమిషాల్లో చర్యలు చేపడతామని తెలిపారు సీఈవో. ప్రచార సమయం ముగిసింది కాబట్టి బల్క్ మెసేజ్లు కూడా చేయకూడదని హెచ్చరించింది ఈసీ. రాబోయే 48 గంటల పాటు రాష్ట్రమంతటా డేగ కన్నుతో వాచ్ చేస్తున్నామని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…