ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. జాతర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

| Edited By: Anil kumar poka

Feb 19, 2022 | 11:52 AM

తెలంగాణలోని ములుగు(Mulugu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులోని ఐదుగురు మృత్యువాత పడ్డారు....

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. జాతర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
Medaram Accident
Follow us on

తెలంగాణలోని ములుగు(Mulugu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులోని నలుగురు మృత్యువాత పడ్డారు. సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ప్రవేశ మార్గంగా భావించే.. గట్టమ్మ ఆలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. సమచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర ప్రయాసల అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. కారులో ప్ర‌యాణిస్తున్న వారు మేడారం వెళ్తున్నట్లు నిర్ధారించారు. హ‌నుమ‌కొండ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణ‌మైన స‌మ‌యంలో ఈ ప్రమాదం జ‌రిగింది.

మేడారం జాతరకు వెళ్లే మార్గం కావడంతో కొద్దిసేపటిలోనే ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును పక్కకు తరలించి, రాకపోకలను పునరుద్ధరించారు. మృతులను ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల(జడ్‌) వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Knowledge: ప్యాసింసర్‌ రైళ్లలో 24 కోచ్‌లుంటే.. గూడ్స్‌ రైళ్లలో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఎందుకుంటాయో తెలుసా?

క్షణాల్లో కోటీశ్వరుడయ్యాడు.. 42 సెకన్లలో ఎంత సంపాదించాడో తెలుసా..??

Andhra Pradesh: రైల్వే స్టేషన్‌లో సరదాగా యువకుడు.. తేడా కొట్టడంతో బ్యాగ్ చెక్ చేసిన అధికారులు షాక్..