కాంగ్రెస్ పార్టీలో చిత్రాలు, విచిత్రాలు కామన్.. కానీ ఈ స్టోరీ అంతకుమించి..!

తెలంగాణలో రాజకీయాలు మామూలుగా ఉండవు. పదవుల కోసం, పనుల కోసం ఎక్కడికైనా వెళతారు. అందులోనూ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్లో ఇంటర్నల్ రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరెవరికి హై కమాండ్ నేతలతో ఎలాంటి పరిచయాలు ఉంటాయో చెప్పలేము. అప్పటివరకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు అకస్మాత్తుగా తెరపైకి వస్తారు.

కాంగ్రెస్ పార్టీలో చిత్రాలు, విచిత్రాలు కామన్.. కానీ ఈ స్టోరీ అంతకుమించి..!
Telangana Congress

Edited By: Balaraju Goud

Updated on: Apr 18, 2025 | 4:34 PM

తెలంగాణలో రాజకీయాలు మామూలుగా ఉండవు. పదవుల కోసం, పనుల కోసం ఎక్కడికైనా వెళతారు. అందులోనూ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్లో ఇంటర్నల్ రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరెవరికి హై కమాండ్ నేతలతో ఎలాంటి పరిచయాలు ఉంటాయో చెప్పలేము. అప్పటివరకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు అకస్మాత్తుగా తెరపైకి వస్తారు. సడన్‌గా పెద్ద పెద్ద పదవులు వచ్చి పడతాయి. ఇలాంటి చిత్రాలు విచిత్రాలు ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీలో చాలా చూశాం. కానీ ఈ స్టోరీ అంతకుమించి..!

తెలంగాణ కేబినెట్‌లో ఆ ఎమ్మెల్యేకు స్థానం కల్పించండి అంటూ అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హరిస్ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆలస్యంగా బయటకు వచ్చిన విషయం ఇది. అమెరికాలో ఎన్నికలకు ముందు భారత సంతతి కలిగిన కమల హరీష్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇక తెలంగాణలో మా జిల్లాకు మంత్రి పదవి రాలేదు అంటూ తనకు కచ్చితంగా కేబినెట్లో చోటు దక్కాలని అడుగుతున్నారు ఒక నేత. ఈమధ్య అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ అవసరమైతే నేను రాజీనామా చేస్తానని హైకమాండ్‌కు వార్నింగ్ ఇచ్చినంత పనైంది.

అంతేకాదు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోతే, నా నియోజకవర్గంలో ఇంకొకరిని నిలబెట్టి గెలిపించి వారికైనా ఇవ్వండి అంటూ చెప్పిన ఆ ఎమ్మెల్యే తరపునని కమల హరిస్ లేఖ రాశారట. హైదరాబాద్ ఆనుకుని ఉన్న ఆ జిల్లాకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే అసలు అమెరికా ఉపాధ్యక్షులు వరకు వెళ్లి ఫైరవి ఎలా చేయించుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సరే ఆమె లేఖ రాశారు పాపం అయినా ఎమ్మెల్యేకు ఇంకా మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. ఇందులో అసలు ట్విస్ట్ అంటే… అసలు నిజంగానే కమల హరిస్ లేఖ రాశారా! లేక అది ఫేక్ లెటర్ అని రాహుల్ గాంధీ కార్యాలయం పక్కన పెట్టిందా! లేదా ఆయన ప్రత్యర్థులు ఎవరైనా కావాలని ఇదంతా చేస్తున్నారా! ఇలాంటి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి.

సదరు ఎమ్మెల్యే మాత్రం నేను గత ఐదేళ్లుగా అసలు అమెరికాకే పోలేదు. నాకు హైకమాండ్‌తో మంచి పరిచయం ఉంది నేను అక్కడి నుంచి ఫైర్ అవి చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి లేక ఎవరు రాసినట్లు.. ఎవరు ఆకతాయి చేసిన పనా? లేక ప్రత్యర్ధులు చేసిన వ్యవహారమా..? అదంతా పక్కన పెడితే అమెరికా నుంచి తెలంగాణ మంత్రి పదవి కోసం లేఖ అనేది పొలిటికల్ సర్కిల్‌లో మాంచి డిస్కషన్ నడుస్తుంది..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..