KCR Health Update: నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం.. వాకింగ్ స్టాండ్ సాయంతో నడిపించిన వైద్యులు..
దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు 2 గంటలకు పైనే ఆపరేషన్ జరిగగా విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
KCR Health Updates: పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్.. అనారోగ్యం పాలవడంతో ఆయన ఆభిమానులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు చెప్పినప్పటికీ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు 2 గంటలకు పైనే ఆపరేషన్ జరిగగా విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ కు చికిత్స కొనసాగుతోంది. తాజాగా.. వైద్యులు కేసీఆర్ ను వాకర్ సహాయంతో నడిపిస్తున్న ఫొటోలను ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసింది. కేసీఆర్‌ను వాకింగ్ స్టాండ్ సాయంతో వైద్యులు నడిపించారు. 6 నుంచి 8 వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులుతెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్, కేసీఆర్ సతీమణి శోభ సహా కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయుకులు సైతం ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.
కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..